Home

posterforinner2

మేము భారతీయులం
అందులో కళింగ ఓ స్ఫూర్తి పదం. మరి ఓ పురాతన రాజ్యం కూఢా

మహాభారత కాలంలో వైతరణి నది మొదలుకొని ఉన్న ప్రాంతమంతా కళింగ దేశమని వ్యవహరించేవారు. ఇది ఉత్తర భారతదేశ ప్రాంతం. దక్షిణంలో గోదావరి నది వరకు విస్తరించి ఉండేది. కళింగదేశ రాణి సుషేణ కుమారులు అయిదుగురు. వారు అంగ, వంగ, కళింగ పుండ్ర, సుహ్మ రాజ్యాలను స్థాపించారు. ఇది చారిత్రక సత్యం. కళింగ రాజధాని రాజపురి అని మహాభారతంలో చెప్పబడింది. చిత్రాoగదుడనే కళింగరాజు కుమార్తెను దుర్యోధనుడు పెళ్లి చేసుకున్నట్లు చరిత్ర చెపుతుంది. కళింగ-ప్రపంచానికి స్ఫూర్తిపదం. యావద్దేశం అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమనే సమయంలో స్వేచ్ఛా స్వాతంత్ర అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాణ నష్టంతో, శోకమే ఎరుగని అశోకునికి శోకమంటే చూపించి మనసు మార్చారు. శాంతికోసం బీజం వేశారు. ధర్మం కోసం మార్గం వేశారు. కళింగయుద్ధమే లేని నాడు అశోకుని శాంతి సందేశము లేదు. ధర్మ చక్రముా లేదు. అందుకే కళింగ ప్రజలు స్ఫూర్తి ప్రధాతలు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా నివశిస్తున్నప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఉపాధి అవకాశలకోసం తరలిపోయాము. ఎక్కడున్నా కష్టించి పనిచేసే మనస్తత్వమున్న మేము మా ప్రత్యేకత కనబరుస్తునే ఉంటాము. చారిత్రకంగా విశేష ఖ్యాతి గాంచిన కళింగులైన మేము వేలాది సంవత్సరాల కాలగమనంలో వెనుకబడి పోయాము. అభివృద్ధిని చేజిక్కించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాము. మా అభివృద్ధి పురోగతికోసం, సంఘీభావం కోసం స్థాపించబడింది కళింగమైత్రి పత్రిక మరియు ఈ వెబ్ సైట్. ఇది ఓ సమాచార సాధనం అంతర్గత అభిప్రాయాల సమాహారం. ప్రపంచంలో ఎక్కడున్నా ఎదురుపడి విశేషాలు అందించే సాంకేతిక సమాచార సమారాధన.